చిదంబరం ఆరోగ్యస్థితి అధ్యయనానికి సమితి

చిదంబరం ఆరోగ్యస్థితి అధ్యయనానికి సమితి

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఆరోగ్య పరిస్థితి అధ్యయనానికి వైద్య నిపుణుల సమితిని ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ నిర్వాహకుల్ని ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం గురు వారం ఆదేశించింది. శుక్రవారంలోగా చిదంబరం ఆరోగ్య పరిస్థితి పై నివేదిక సమర్పిం చాలని కోరింది. చిదంబరం కుటుంబ వైద్యుడు డాక్టర్. నాగేశ్వర్ రెడ్డి కూడా వైద్య నిపుణుల సమితిలో ఉంటారు. చిదంబరం ఆరోగ్యం గురించి గురు వారం రాత్రి ఏడు గంటలకు నిపుణుల సమితి సమావేశం కానుంది. కడుపు నొప్పి, ఇతర సమస్యలతో బాధపడిన ఆయనకు సోమవారం ఎయిమ్స్ లో చికిత్స చేసిన తర్వాత అదే రోజు విడుదల చేశారు. అనారోగ్యం కారణంగా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని బుధవారం చిదంబరం చేసిన వినతిని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. నవంబరం 13 వరకు ఆయనను జ్యూడీషియల్ కస్టడీకి ఆదేశించింది. చిదంబరాన్ని ఒక రోజు పాటు విచారణకు తమకు అప్పగించాలని ఈడీ చేసిన విజ్ఞప్తినీ ధర్మాసనం తోసి పుచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ, ఈడీ అధికా రులు చిదంబరంను విచారిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos