ఔను…వారిద్దరూ ఒక్కటయ్యారు

ఔను…వారిద్దరూ ఒక్కటయ్యారు

హోసూరు : రాజకీయంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి మరోసారి నిజమైంది. కృష్ణగిరి జిల్లాలోని ఎడిఎంకె పార్టీ బడా నాయకుల మధ్య కాస్త విభేదాలున్న సంగతి అందరికి తెలిసిందే. జిల్లాలో సీనియర్ నాయకులు కెపిఎం, తంబిదురై, బాలకృష్ణారెడ్డి తదితరులకు మద్దతుదారులు ఎక్కువగా వున్నారు. మాజీ స్పీఎకర్ తంబిదురై మాట పక్కన పెడితే జిల్లాలో ప్రస్తుతం కె.పి.మునిస్వామి, బాలకృష్ణారెడ్డిల హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. హోసూరు ప్రాంతంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య ఎలా వున్నా, కార్యకర్తల మధ్య విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. 2021లో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నందున నాయకులు ఏకమయ్యే తరుణం ఏర్పడిందని చెప్పవచ్చు. కృష్ణగిరి జిల్లాలో ప్రస్తుతం బలంగా ఉన్న డిఎంకె పార్టీని ఎదుర్కోవాలంటే ఎడిఎంకె పార్టీ నాయకులు మనస్తాపాలను పక్కన పెట్టి ఏకం కాక తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో ఎడిఎంకె పార్టీ ఎక్కువ సీట్లలో గెలవాలనే వ్యూహంతో నాయకులు సన్నాహాలు చేసుకొంటున్నారు.అందులో భాగంగా ఇటీవల మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి రాజ్యసభ సభ్యుడు కెపి.మునిస్వామిని మర్యాదపూర్వకంగా కలసి ఎన్నికల గురించి చర్చించుకున్నారు. జిల్లాలో ఎడిఎంకె పార్టీ మరోసారి తన హవా కొనసాగించే దిశగా ఇద్దరి నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు ఎడిఎంకె పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. ఇప్పటికే కృష్ణగిరి జిల్లాలో తళి, హోసూరు, సూలగిరి, కృష్ణగిరి, వేపనపల్లి  స్థానాలు డిఎంకె పార్టీ చేతిలో ఉన్నందున, రానున్న ఎన్నికలలో ఈ స్థానాలను సైతం ఎడిఎంకె పార్టీ ఖాతాలోకి చేర్చాలని ఇద్దరు నాయకులు చర్చించినట్లు సమాచారం. ఏదేమైనా కృష్ణగిరి జిల్లాలో ఎడిఎంకె నాయకుల మధ్య సయోధ్య కుదరడం మంచి పరిణామమని పార్టీ నాయకులు సంతోషిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos