భాజపాకు దెబ్బ

భాజపాకు దెబ్బ

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల ముందు భాజపాకు గట్టి దెబ్బ తగిలింది. మాజీ మంత్రి, నాలుగు సార్లు శాసనసభ్యుడుగా విజయాన్ని సాధించిన సీనియర్ నేత హరిశరణ్ సింగ్ బల్లీ శనివారం భాజపాకు రాజీనామా చేసి ఆమ్ఆద్మీ పార్టీలో చేరారు. ఆయన్ను ఆమ్ఆద్మీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా సాదరంగా పార్టీలోకి ఆహ్వా నిం చారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్ ఢిల్లీని ఒక అమ్మలా పాలిస్తు న్నారు. విద్య, వైద్యంతో పాటు తదితర రంగాల్లో విప్లవాన్ని తెచ్చారు. ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ వద్ద ప్రణాళిక ఉంద’ని పేర్కొన్నారు. హరినగర్ శాసన సభ్యుడైన ఆయన మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈ ఎన్నికల్లో హరిశరణ్కు బదులుగా తజీందర్ పాల్ సింగ్ బగ్గాను భాజపా బరిలోకి దింప టంతో ఆగ్రహించిన హరిశరణ్ సింగ్ భాజపా నుంచి వైదొలగారు.

1 comment

తాజా సమాచారం

Latest Posts

Featured Videos