పది వారాలు షట్ డౌన్ చేయాలి

పది వారాలు షట్ డౌన్ చేయాలి

వాషింగ్టన్: పది వారాల పాటు షట్ డౌన్ ను కఠినంగా అమలు చేక పోతే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని మైక్రోసాఫ్ట్ సహ వ్యావస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సూచించారు. ది వాషింగ్టన్ పోస్ట్ సంపాదకీయ పుటలో ప్రత్యేక కథనాన్ని రాసారు. పెరుగుతున్న మహమ్మారిపై ఎవరినీ నిందిచకుండా, దేశవ్యాప్త షట్ డౌన్ ను అమలు చేయాలి. చాలా రాష్ట్రాల్లో బీచ్ లు ఇంకా తెరచుకునే ఉన్నాయి. రెస్టారెంట్లు పని చేస్తున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణి స్తున్నారు. వారి లానే వైరస్ కూడా వ్యాపిస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటే షట్ డౌన్ ఒక్కటే మార్గమ’న్నారు. కరోనా పీడితుల సంఖ్య తగ్గు ముఖం పట్టేంత వరకూ షట్ డౌన్ చేసినపుడే ప్రజల ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. కనీసం 10 వారాల పాటు దీన్ని అమలు చేయాలి. ఈ విషయంలో వెనుకంజ వేస్తే, అది ఆర్థిక బాధలను పెంచుతుంది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను ఏడాదిన్నర కంటే ముందుగానే తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos