తేజస్వికి పెరుగుతున్న ఆదరణ..కమలానికి కంగారు

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ రంగ ప్రవేశంతో బీహారు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారి పోతుందని భాజపా బుధవారం తెలిపింది. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్కు రానూ రానూ ప్రజాదరణ పెరుగుతోంది. ఆయన సభలకూ ప్రజలు అధిక సంఖ్యలో హాజరువుతున్నారని సర్వేలు తేల్చాయి. దీనిపై అధికార బీజేపీ పక్షం అనధికారికంగా స్పందించింది. ‘తేజస్వీ యాదవ్ ర్యాలీలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావడం అత్యంత సహజం. లాలూ హయాంలో కూడా అలాగే వచ్చేవారు. ప్రధాని మోదీ ఎంటర్ కానివ్వండి. ఆయన సభలు ప్రారంభం కాగానే సీన్ మొత్తం మారిపోతుంది. ఇవన్నీ అత్యంత సహజం.. లాలూ హయాంలోనూ ఇలాగే జరిగింది. ఆర్జేడీ ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత సహజం’ పేర్కొంది. తేజస్వీ యాదవ్ నిర్వహించే ర్యాలీలపై భాజపా అధిష్ఠానం తొలి నుంచీ ఒక కన్నేసి ఉంచుతోంది. . తేజస్వీ ర్యాలీలకు జనం అధికంగా ఆకర్షితుల వుతున్నారని సర్వేలూ వెల్లడించటంతో కమలం శిబిరంలో కంటి మీద కునుకు కరువైంది. మోదీ,ముఖ్యమంత్రి నితీశ్ కలిసి సభలు నిర్వహించి ఎన్డీయే ఐక్యతను చాటుతాం. అప్పుడు పరిస్థితి మారిపోతుంద’ని కమల నాధులు ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos