మాజీ ఎమ్మెల్యే కొడుకుపై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఫిర్యాదు..

మాజీ ఎమ్మెల్యే కొడుకుపై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఫిర్యాదు..

పఠాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే తనయుడు  ఆశిష్‌గౌడ్‌ మద్యం మత్తులో హోటల్‌లో బీభత్సం చేయడమే కాకుండా తనను అసభ్య పదజాలంతో దూషించి పై అంతస్తు నుంచి కిందకు తోసేయడానికి ప్రయత్నించాడంటూ బిగ్‌బాస్‌ 2 కంటెస్టెంట్‌ సంజనా పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. శనివారం రాత్రి మాదాపూర్ లోని ఓ పబ్బులో వీరంగం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం సేవించి హల్చల్ చేశాడు. పబ్బులో ఉన్న మహిళలపై అనుచితంగా మాట్లాడుతూ అడ్డొచ్చిన వాళ్ళను చితకబాదాడని తెలుస్తోంది. ఇదే పబ్బులో ఉన్న తనను దూషించాడని ఆరోపించింది. రాత్రి రెండు గంటల సమయంలో తన స్నేహితురాలితో  కలిసి ఉన్న సమయంలో ఘటన జరిగినట్లు తెలిపారు. దాంతో భయపడి తాము అక్కడ నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. సంఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆశీష్గౌడ్గతంలో క్రిమినల్కేసులో అరెస్ట్అయ్యాడు. అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా ఎదుగుతున్న తనను చూసి ఓర్వలేని కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ వ్యాఖ్యానించారు. నేపథ్యంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆశీష్, సంజన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. తాను వేధించినట్టు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడబోనని అన్నారు. తాను కూడా పోలీసుల వద్దకు వెళ్లతానని చెప్పారు

తాజా సమాచారం