బిగ్ బాస్ అశ్లీలతపై హైకోర్టు విచారణ

బిగ్ బాస్ అశ్లీలతపై  హైకోర్టు విచారణ

అమరావతి: బిగ్ బాస్ రియాల్టీ షో రద్దు చేయాలని కోరుతూ దాఖలైప వ్యాజ్యంపై హై కోర్టులో విచారణ శుక్రవారం ఆరంభమైంది. ఈ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదించారు.ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్ లైన్స్ ను టీవీ షోలు పాటించడం లేదని విమర్శించారు. బిగ్ బాస్ అశ్లీలతపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించేందుకు కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసు ఇచ్చే విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos