వలసొచ్చిన అరుదైన పక్షి

వలసొచ్చిన అరుదైన పక్షి

కొమురం భీం జిల్లా: పెంచికల్పేట మండలం నందిగాం అడవుల్లోని పాలరాపుగుట్ట ప్రాంతంలో అరుదైన గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ అనే పక్షి కనిపించింది. పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షణీయంగా ఉంది. అక్కడి అటవీ అధికారులు వెంటనే దానిని కెమెరాల్లో బంధించారు. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని తెలిపారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి, అసోం, పడమటి కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్పేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos