బాలాకోట్‌లో మళ్లీ ఉగ్ర శిబిరాలు

బాలాకోట్‌లో మళ్లీ ఉగ్ర శిబిరాలు

న్యూ ఢిల్లీ: బాలాకోట్లో తమ శిబిరాల్ని తిరిగి ప్రారంభించేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అహ్మద్ పటేల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సరి హద్దుల రక్షణకు సైనిక బలగాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 17 వరకూ జమ్మూ కశ్మీర్లో జరిగిన 594 ఉగ్ర దాడుల్లో 79 మంది భద్రతా సిబ్బంది, 37 మంది పౌరులూ ప్రాణాలు కోల్పోయారన్నారు. నిరుడు జరిగిన 614 దాడుల్లో 91 మంది సైని కులు, 39 మంది పౌరులు ప్రాణాలొది లార న్నారు. గత అక్టోబర్ వరకూ 171 చొరబాట్లు జరిగాయన్నారు. నిరుడు వీటి సంఖ్య 328.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos