‘మేము దాడికి దిగితే ఏ వ్యవస్థా అడ్డుకోలేదు’

‘మేము దాడికి దిగితే ఏ వ్యవస్థా అడ్డుకోలేదు’

హైదరా బాదు : సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు. కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు చాలా గట్టి మనిషి. ఆయన ఎప్పుడూ కంటతడి పెట్టడం చూడలేదు. మా తండ్రి ఎన్టీఆర్ హయాం నుంచీ అసెంబ్లీలో సమస్యలపైనే కొట్లాడేవాళ్లమన్నారు. అలాంటిది ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఎదుటి వారి పరువుపై కొడుతున్నారు. నా చెల్లెలు భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలు చేయడం దురదృష్టకరం. అధికార పక్షం నేతల మాటలు సహించరానివి. వారి మాటలు వింటుంటే అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిడిలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదు. భరతం పడతాం. ఖబడ్దార్. వ్యక్తిగతంగా దాడి చేస్తే.. మేము దాడి చేయాల్సి వస్తుంది. ఏ వ్యవస్థా ఇక అడ్డుకోలేదు. ఆ గోడలు బద్దలు కొట్టుకు వస్తాం. వాళ్ల కుటుంబంలోనూ ఏదో సమస్య ఉందని, వాళ్ల కుటుంబ సభ్యులే ఒప్పుకున్నారు. మా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ ఓ సమస్యపై వారి కుటుంబ సభ్యులే ముందుకొచ్చి చెప్పారు. దానిని డైవర్ట్ చేయడం కోసం మా ఫ్యామిలీపై నీచంగా మాట్లాడారు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్లను వెళ్లి అడిగితే వారేమనుకుంటున్నారో తెలుస్తుందన్నారు. అందరికీ అమ్మలు, భార్యలున్నారు. నేను ఎమ్మెల్యే, నాపై లేదంటే చంద్రబాబుపై రాజకీయ విమ ర్శలు చేసుకుంటే ఫర్వాలేదు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వారిపై దూషణలు చేయడమేంటి? నా సోదరికీ సమాజంలో గౌరవమైన స్థానం ఉంది. రాష్ట్ర అభివృ ద్ధిని పక్కనపెడితే.. కనీసం పేదలకు కొంతైనా సేవ చేశారా? దోచుకున్న సొమ్మును ఇంట్లో దాచుకోవడం తప్ప ఏం మంచి చేశారు. సభలో హుందాగా నడుచు కోవాల్సిన అవసరం ఉంది. స్పీకర్ ఉన్నా లేనట్టే ఉంది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఏం జరుగుతోంది. సలహాలు ఇస్తే తీసుకోరు. ప్రతి దాడి చేస్తున్నారు. ప్రతిదానికీ ద్వంద్వార్థాలు తీయడం, టాపిక్ ను డైవర్ట్ చేయడం మంచి సంస్కృతి కాదు. మంచి చెప్పినా మీరు మారరు. మీరు మనుషులు కాదు. మేమే మెడలు వంచి మిమ్మల్ని మారుస్తాం. మా కుటుంబ సభ్యులే కాకుండా ప్రజలు, నా అభిమానులు, పార్టీ కార్యకర్తలు మీ మెడలు వంచుతారు. ఇన్నాళ్లూ ఎన్ని అవమానాలు చేస్తున్నా ఎందుకులే అని ఊరుకుంటున్నాం. చంద్రబాబు కూడా తమను వారించారు. దేనికైనా ఓ హద్దుంటుంది. జరిగిన దానిపై ఉపేక్షించరాదని మా కుటుంబం మొత్తం తీర్మానించింది. పదవులు శాశ్వతం కాదు. ఇవాళ మీరున్నారు..రేపు మేమొస్తాం. రాష్ట్రంలోని వ్యవస్థలను ప్రభు త్వం ఏవిధంగా నిర్వీర్యం చేసిందో జనాలు చూస్తున్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుండేది. నీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలూ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు మంచి ముందుచూపున్న వ్యక్తి. ఇకపై విర్రవీగి మాట్లాడితే సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఇకపై ఎవడైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోవ. చంద్రబాబు అనుమతి మాకు అవసరం లేదు. ప్రజాప్రతినిధులైనందువల్లే మీకు చంద్రబాబు ఇన్నాళ్లూ గౌరవం ఇచ్చారు’అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos