వరవరరావుకు బెయిల్‌ ఇవ్వండి

వరవరరావుకు బెయిల్‌ ఇవ్వండి

న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో ముంబై జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ కవి వరవరరావు (81)కు బెయిల్ ఇవ్వాలని ఆయన భార్య పెండ్యాల హేమలత అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ‘విచారణ లేకుండా ఆయన్ను నిరవధికంగా చెరసాల్లో బంధించటం అమాన వీయం. క్రూరత్వం. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను అతిక్రమించడమేన’ని అందులో పేర్కొన్నారు. ‘2018 నవంబర్లో జ్యుడీషియల్ కస్టడీకి వెళ్ళేనాటికి 68 కేజీల బరువున్న వరవరరావు ఇప్పుడు 50 కేజీల బరువుకు దిగారు. వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, మంచంలో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు,కరోనాడ్ ప్రబలిన తరువాత తలెత్తిన ఇబ్బందుల కారణంగా వరవరరావుకి నిరంతర పర్యవేక్షణ అవసరమౌతోంద’ని పేర్కొన్నట్లు హేమలత తరఫున వినతి దాఖలు చేసిన న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos