మొదటిసారి ఐస్‌క్రీమ్ తిన్న చిన్నారి హావభావాలు..

మొదటిసారి ఐస్‌క్రీమ్ తిన్న చిన్నారి హావభావాలు..

ఇష్టమైన వ్యక్తులు,వస్తువులు,ప్రాంతాలు లేదా ఆహారాన్ని మొదటిసారి చూస్తే కలిగే అనుభూతి జీవితాంతం మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఆ సమయంలో వారిలో కనిపించే హావభావాలు కొన్ని భావోద్వేగానికి గురి చేస్తే మరికొన్ని నవ్వుల్లో ముంచెత్తుతాయి.ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనిపించే హావభావాలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. మొట్టమొదటి సారి ఐస్క్రీం తిన్న చిన్నారిలో కనపడిన హావభావాలు అబ్బురపరుస్తున్నాయి.అమెరికాలో ఓ దంపతులు తొమ్మిది నెలల తమ పాపను ఐస్క్రీం పార్లర్కు తీసుకువెళ్లారు. కోన్ఐస్క్రీంను కొని పాపకు తినిపిస్తుంటే.. తన  రెండు చేతులతోఐస్క్రీమ్ను గట్టిగా పట్టుకుని ఇష్టంగా తినసాగింది. పాప పేరు బ్లేక్లీ.. ఆమె తల్లి బ్రిటారి జెర్నిగాన్తన టిక్టాక్ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. పాప చాలా ఇష్టంగా ఐస్క్రీమ్ను తింటున్న సమయంలో చిన్నారి తల్లిదండ్రులు నవ్వు ఆపుకోలేకపోయారు.ఆమె హావభావాలు వెలకట్టలేనివిగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos