అమితాబ్ నోరు విప్పండి

అమితాబ్ నోరు విప్పండి

ముంబై : నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా గళాన్ని విప్పే సమయం ఆసన్నమైందని మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్ నటులు అమితాబ్ బచ్చన్కు హితవు పలికారు. కార్లో ఇంధనం నింపాక బిల్లును తనిఖీ చేయడం లేదా అని ఆయన్ను ట్విటర్ లో ప్రశ్నించారు. 2012లో పెట్రోల్ ధరలు మిన్నంటినపుడు అమితాబ్ చేసిన వ్యాఖ్యను అవాద్ ఈ సందర్భంగా గుర్తు చేసారు. ‘పెట్రోల్ ధర లీటర్పై 7.5 రూపాయలు పెరగడంతో అసహనంతో ఉన్న ఓ ముంబైవాసి పెట్రోల్ పంప్కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది అతడిని ఎంత పెట్రోల్ కొట్టాలి సార్ అని అడగ్గా. ఆఆయన రూ.2-4ల ల పెట్రోల్ను కారుపై కొట్టండి దాన్ని తగలబెట్టేస్తా’ అంటూ అగ్రహించారని అమితాబ్ పేర్కొన్నారు. ‘మీ కారులో ఇంధనం నింపాక బిల్లు చూడటం లేదా? ఇప్పుడు మీరు మాట్లాడే సమయం వచ్చింది. పక్షపాతం వహించకుండా మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరల చూస్తే కార్లు నడపాలా, లేదా కాల్చేయాలో అర్థం కావడం లేదని ’ రాసారు. ముంబైలో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.86.91లు, డీజిల్ ధర రూ.78.51లు ఉంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos