ప్రపంచానికి భారత్‌ మార్గదర్శి

ప్రపంచానికి  భారత్‌ మార్గదర్శి

అహ్మదాబాద్: ‘భారత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది’అని సోమవారం ఇక్కడ గుమి కూడిన అశేష జనవాహినిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.‘నమస్తే..’అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. అధ్భుత విజేతగా దేశాన్ని నిలిపేందుకు మోదీ కృష్టి చేస్తు న్నారని ప్రశంసించారు. భారత్కు రావడం తనకు ఎంతో గౌరవ ప్రదమన్నారు. ‘ప్రధాని మోదీ నాకు నిజమైన స్తేహితుడు.ఐదు నెలల కిందట ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్ బాల్ మైదానంలో ఆయనకు మోదీకి స్వాగతం పలికాను. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంలో నాకు స్వాగతం లభించింది. 70 ఏళ్లలో భారత్ అద్భుతశక్తిగా ఎదిగింది. ప్రగతి సాధనలో ప్రపంచానికి దిశా నిర్దేశనం చేస్తోంది. ఒక ఛాయ్వా లాగా జీవితాన్ని మొదలు పెట్టాట్టిన మోదీ ఈ స్థాయికి చేరుకున్నారు. మోదీ కేవలం గుజరాత్కే కాదు శ్రమ, పట్టుదలతో ఏదైనా సాధించ వచ్చు అనే దానికి మోదీ నిదర్శనం. భారత్ అద్భుతమైన అవకాశలకు నెలవు. సచిన్ నుంచి విరాట్ కోహ్లీ వరకూ గొప్ప క్రికెటర్లను భారత్ అందించింది. ఏటా భారత్ 2 వేల సినిమాలను నిర్మిస్తోందన్నారు. ఉగ్రవాదంపై రెండు దేశాలూ ఉమ్మడిగా పోరాటాన్ని చేస్తాయి. భారతదేశ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి . చెడుపై మంచి గెలుపుకు దీపావళి నిదర్శనం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ కలిసి ఉండే దేశం భారత్’ అని ప్రశంసించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos