గాడిద పాల డెయిరీ

గాడిద పాల డెయిరీ

హిస్సార్: గాడిద పాల డెయిరీ హర్యానా, హిస్సార్ లోని నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ లో ఏర్పాటు కానుంది..10 హలారి జాతి గాడిదలను గుజారాత్ నుంచి తెప్పించనున్నారు.గాడిద పాల్లోని న్నో ఔషధ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో జబ్బులకు గాడిద పాలు ఔషధంగా పని చేస్తాయి.హలారి గాడిదలకు చాలా డిమాండ్ ఉంది. వీటి పాల ధర లీటర్ కు రూ. 7 వేల వరకు ఉంటుంది. అలర్జీ, ఉబ్బసం, ఊబకాయం, క్యాన్సర్ వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తి ఈ గాడిదల పాలుకు ఉంటుంది. తొలుత గాడిదల్ని ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత డెయిరీ పనులు మొదలవుతాయని జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం తెలిపింది. రీసర్చ్ సెంటర్ మాజీ సంచాలకుడు త్రిపాఠి గాడిద పాల విశిష్టతను వివరించారు.‘ ఆవు, గేదె పాల ద్వారా చిన్న పిల్లలు అప్పుడప్పుడు అలర్జీలకు గురవుతారు. హలారి జాతి గాడిదల పాలతో ఎలాంటి అలర్జీలు రావు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్లు ఈ పాలలో ఉంటాయన్నా’రు. గతంలో త్రిపాఠి ఆధ్వర్యంలోనే గాడిద పాలపై పరిశోధన ప్రారంభమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos