ప్రజా తీర్పును వంచించిన శివసేన

ప్రజా తీర్పును  వంచించిన శివసేన

న్యూ ఢిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షా శివసేనపై వరుస ట్వీట్లలో బుధవారం నిప్పులు చెరిగారు. ‘ప్రజా తీర్పును శివసేనే వంచించింది. భాజపా ఎంత మాత్రం వంచనకు పాల్పడ లేద’ ని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో తాము ఎలాంటి హామీ ఇవ్వలేదనే తాను మరోసారి చెప్పదల చుకున్నానని, ఆదిత్య థాకరే కానీ ఉద్ధవ్ థాకరే కానీ వేదికపై ఉన్న ప్రతిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఉంటారని తాము చెబుతూ వచ్చామన్నారు. మరి అప్పుడే వాళ్లు (శివసేన) ఎందుకు దాన్ని వ్యతిరేకించలేకపోయారని ప్రశ్నించారు. ‘మాతో (బీజేపీ) పోటీ చేసి శివసేన ఎమ్మె ల్యేలు గెలవ లేదు. మోదీ పోస్టర్ పెట్టుకోకుండా గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. శివసేన సమావేశాల్లోనూ అందరికంటే మోదీజీ కటౌట్లే పెద్దగా పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం కారణంగానే ‘మహా వికాశ్ అఘాడి’ సర్కార్ ఏర్పాటు జరుగు తోంద న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos