మంత్రి యశ్‌పాల్ ఆర్య, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యలు కాంగ్రెస్‌లోకి

మంత్రి యశ్‌పాల్ ఆర్య, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యలు కాంగ్రెస్‌లోకి

న్యూ ఢిల్లీ : ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి మంత్రి యశ్పాల్ ఆర్య,అతని కుమారుడు, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యలు సోమవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో యశ్ పాల్ ఆర్య రవాణా శాఖ మంత్రిగా ఉండగా, అతని కుమారుడు సంజీవ్ నైనిటాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్ని కయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావత్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ ల సమక్షంలో యశ్ పాల్ ఆర్య,సంజీవ్ లు కాంగ్రెస్లో చేరారు.భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి వారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. యశ్ పాల్ ఆర్య ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా చెప్పారు.యశ్పాల్ ఆర్యకు ఘర్ వాపసీ లాంటిదని అన్నారు. యశ్పాల్ ఆర్య 2007 నుంచి 2014 వరకు ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా ఉన్నారు.బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరడం చూస్తుంటే ఉత్తరా ఖండ్లో ఏ విధంగా గాలి వీస్తుందో స్పష్టమైన సూచన అని కేసీ వేణు గోపాల్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos