శిథిలావస్థ ఇంట్లో అర్పిత తల్లి జీవనం

శిథిలావస్థ ఇంట్లో అర్పిత తల్లి జీవనం

కోలకతా:  ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అరెస్టయిన అర్పిత ముఖర్జీ  పేరు ఇప్పుడు మార్మోగు తోంది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహితురాలైన ఆమె కోల్ కతాలో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించారు. ఆమె తల్లి మినాటి ముఖర్జీ మాత్రం కోల్‌కతాలోని బెల్గోరియాలో శిథిలావస్థలో ఎలాంటి సౌకర్యాలు లేని అతి సాధారణ ఇంట్లో ఉన్నారు.  అరెస్టయ్యే వారం ముందు తన కుమార్తె ఇంటికి వచ్చిందని మినాటి తెలిపారు. ఎప్పుడు వచ్చినా ఎక్కువ సేపు ఉండదని, తనను చూసి కొన్నిగంటల్లోనే వెళ్లిపోయేదన్నారు. మినాటీని చూసుకునేందుకు ఇద్దరు సహాయకులను నియమించిందని స్థానికులు చెప్పారు. ‘నేను చెప్పినట్టు వింటే అర్పితకు పెళ్లి చేసేదాన్ని.  అర్పిత తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఆమెకు ఉద్యోగంపై ఆసక్తి లేదు.  సినిమాలు, టీవీల్లో నటించాలన్న కోరికతో చాలా కాలం కిందటే ఈ ఇంటిని విడిచిపెట్టింది. అర్పితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసింద’న్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos