హింస ఎక్కువై, యువతను రెచ్చగొట్టే అర్జునరెడ్డి

హింస ఎక్కువై, యువతను రెచ్చగొట్టే అర్జునరెడ్డి

గోవా: అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించేదాన్నే కాదని మలయాళ నటి పార్వతీ మీనన్ గోవా చలన చిత్రోత్సవ వేదికలో విజయ్ దేవరకొండ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ‘ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వదిలేస్తాం. అర్జున్రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంప దెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్లో వచ్చిన వ్యాఖ్యాల్ని చూసి అవాక్కయ్యాను. హింస ఎక్కువై, యువతను రెచ్చగొట్టేలా ఉంది. ఒక నటిగా ఈ సినిమాలో నటించకుండా మాత్రమే ఉండగలను. దర్శకుడితో ఇలాంటి సినిమా చేయవద్దని చెప్పలేన’ని పేర్కొన్నారు. ‘తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసు కుం టూ పోయే జోకర్ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందన’డం ప్రస్తావానర్హం. ‘ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడుతోం ది. ప్రేమలో ఉన్నప్పుడు చిన్నపాటి ఘర్షణలు సహజం. అది ప్రేమజంటకు అర్థమవుతుంది. దాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తు న్నారో అర్థం కావట్లేదు. పార్వతిని, ఆమె చేసే పనిని నేను ఇష్టపడతాను. ఆమె ప్రశ్నల ఆంతర్యాన్ని అర్థం చేసుకోగలను. కొన్ని సార్లు ఆమె మాటలతో ఏకీభవిస్తాను. కానీ సామాజిక మాధ్యమాల హడావుడే చికాకు కలిగిస్తోంది. వారేంమాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేద’ని ఆగ్రహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos