అరకు అందాలను చూసొద్దామా..

అరకు అందాలను చూసొద్దామా..

భూలోక స్వర్గంగా పిలిచే ఆంధ్రప్రదేశ్‌లోని
అరకు లోయను పర్యాటకులు ఓ సారైనా సందర్శించి తీరాల్సిందే. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం
అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలోని అరకు లోయ ప్రముఖ పర్యాటక
ప్రాంతంగా పేరొందింది. అనేక బీచ్‌లు, ఆలయాలు, పర్వత విడిది ప్రాంతాలకు అరకు పేరొందింది.
దీని చుట్టూ ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులతో పాటు పొగ మంచుతో కూడిన మేఘాలు ఆవరించి
ఉంటాయి. ఒకటి, రెండు రోజుల పాటు విడిది చేయడానికి వీలుగా ప్లాన్‌ చేసుకుంటే బాగుంటుంది.
విశాఖ పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో ఈ సుందర లోయ ఉంది. సెప్టెంబరు నుంచి మే వరకు
పర్యాటకానికి అనువుగా ఉంటుంది. ఎక్కువ మంది పర్యాటకులు డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు
వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు
పడిపోతుంది. పర్వతారోహణ, గుహల సందర్శన, ప్రకృతి రమణీయ దృశ్యాల వీక్షణకు…దీనికి మించిన
పర్యాటక ప్రాంతం మరొకటి ఉండదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos