ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించటం లేదు

ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించటం లేదు

నెల్లూరు : ఆక్వా రైతుల్లో 70 శాతం మందికి గిట్టుబాట ధరించటం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి మంగళవారం లోక్సభలో రాత పూర్వకంగా అంగీకరించారు. సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మేరకు బదులిచ్చారు. ఆక్వా ఉత్పత్తులపై పెట్టే ఖర్చు, లభించే నాణ్యత, పాటించే యాజమాన్య పద్ధతులు, వాతావరణ పరిస్థితులు గిట్టుబాటు ధర నిర్ణయానికి దోహదం చేస్తాయన్నారు. స్థానిక, ఇతర రాష్ట్రాల్లో ఆక్వా ఉత్పత్తుల ధరల పైన అవగాహన ఉంటే వ్యాపారులు కుమ్మక్కైనా ఎటువంటి నష్టం జరగదని చెప్పారు. నీలి విప్లవ- సమగ్ర అభివృద్ధి పథకం కింద ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలకు ప్రభుత్వం సహకారాన్ని అందజేస్తోంద న్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (ఎంపేడా) ఆక్వా రైతులకు ఎగుమతులకు మంచి ధర అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos