అన్నా డీఎంకే అభ్యర్థిత్వాలకు ఆశావహుల దరఖాస్తులు

హొసూరు : రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పాలక అన్నా డీఎంకే తరఫున పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థులు పార్టీ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించారు. హొసూరు కార్పొరేషన్, హొసూరు యూనియన్ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను సమర్పించారు. హొసూరు మీరా మహల్ కళ్యాణ మంటపంలో నిర్వహించిన సమావేశంలో ఆశావహులు నుంచి మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. రెండు రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తామని బాలకృష్ణా రెడ్డి తెలిపారు. కాగా హొసూరు కార్పొరేషన్,

హొసూరు యూనియన్ల నుంచి అన్నా డీఎంకే అభ్యర్థులుగా పోటీ చేయడానికి వందల మంది ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తులను సమర్పించడం విశేషం.

తాజా సమాచారం