ఆ జైలులో 27 మంది ఖైదీలకు ఎయిడ్స్!

ఆ జైలులో 27 మంది ఖైదీలకు ఎయిడ్స్!

బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేని జైలులో ఖైదీలకు ఎయిడ్స్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంపై సర్వత్రా అనుమానాలు,విస్మయం వ్యక్తమవుతోంది.ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది ఖైదీలకు ఎయిడ్స్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది.ఈ ఘటన వెలుగు చూసింది ఎక్కడో పేదరికంతో వెనుకబడ్డ ఆఫ్రికన్‌ దేశాల్లో కాదు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రి సెంట్రల్‌ జైలులో.ఈ విషయం ఎలా వెలుగు చూసిందో పూర్వపరాలు పరిశీలిస్తే..2018వ సంవత్సరంలో గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు ఓ నేరానికి సంబంధించి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.అయితే తాను ఎయిడ్స్‌తో బాధ పడుతున్నానని అందువల్ల తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మరోసారి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.ఈ క్రమంలో ఖైదీ తరపున వాదనలు విపిపించిన న్యాయవాది రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధ పడుతున్నారని కోర్టుకు నివేదించారు.దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం అంతమంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధ పడుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది.జైల్లోకి రాకముందే ఖైదీలకు ఎయిడ్స్ఉందా లేదా జైల్లోకి వచ్చాక ఎయిడ్స్బారిన పడ్డారా అంటూ ప్రశ్నించిన ధర్మాసనం ఈ విషయాలపై పూర్తి వివరాలను తమ ముందుం చాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఖైదీలకు అన్ని వైద్య పరీక్షలు చేయించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఖైదీల ఆరోగ్య పరిస్థితి ఏమి టో కూడా తమకు తెలియచేయాలని ఆదేశించింది.ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, దీన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నెల 2కి వాయిదా వేసింది. రోజున పూర్తి వివరా లతో తమ ముందు హాజరు కావాలని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్కు స్పష్టం చేసింది. మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.అసలు ఖైదీలకు ఎయిడ్స్‌ వ్యాధి ఎలా సోకిందంటూ ప్రశ్నించిన కోర్టు జైల్లోకి వచ్చాక ఖైదీలు ఎయిడ్స్బారిన పడ్డారని తెలిస్తే జైలు సూపరింటెండెం ట్ పై చర్యలు తప్పవని హెచ్చరించింది.చివరగా ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామికి స్పష్టం చేయగా ఎయిడ్స్‌ బారిన పడ్డ ఖైదీలను మిగిలిన వారి నుంచి వేరు చేస్తామని చెప్పగా.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది నేరమని, వారి పట్ల అది వివక్ష చూపడమే అవుతుందని వ్యాఖ్యానించింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos