కుటుంబాల జోలికి రావాలనుకోము

కుటుంబాల జోలికి రావాలనుకోము

అమరావతి : శాసనసభా వ్యవహారాల సలహా సమితి సమావేశంలో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెదేప తరపున హాజరైన అచ్చెన్నా యుడుతో సీఎం జగన్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తే తాము ఊరుకునేది లేదని మంత్రులు బుగ్గన, జోగి రమేశ్ అన్నారు. ఈ దశలో జగన్ కల్పించుకుని..‘మనం రాజకీ యులం…. మనలో మనం వంద అనుకుంటాం. మేము కుటుంబాల జోలికి రావాలనుకోం. మీరు కుటుం బాల జోలికి వస్తే మా సీఎం కుటుంబాన్ని అంటారా అని మా వాళ్లు అంటారు. అందుకే మీరు కుటుంబాల గురించి మాట్లాడటం మానేస్తే. మా వాళ్లు కూడా ఆటోమేటిక్ గా మానేస్తార’ని చెప్పారు. సభలో మీరు లేవనెత్తబోయే ప్రశ్నలు, మేము లేవనెత్త బోయేవి దాదాపు ఒకటేనని జగన్ అన్నారు. అన్ని విషయాలపై చర్చిద్దామని. మీకు కావాల్సినన్ని రోజులు చర్చిద్దామని చెప్పారు. మీరు కావాలను కుంటే రాజధానిపై, ఈఎస్ఐ స్కామ్ పై కూడా చర్చ జరుపుతామని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos