విరుష్క ఇలా గడుపుతున్నారు…

  • In Sports
  • March 28, 2020
  • 127 Views
విరుష్క ఇలా గడుపుతున్నారు…

దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇండియా కెప్టెన్ విరాట్కోహ్లీ ప్రస్తుతం సతీమణి అనుష్కశర్మతో కలిసి స్వీయ నిర్బంధంలో సేద తీరుతున్నాడు. మరోవైపు బయట నిత్యావసర దుకాణాలు మినహా మిగతావన్నీ మూసివేయడంతో విరాట్కు హెయిర్స్టైలిస్ట్ ఎవరూ దొరకలేదు. దీంతో అనుష్కనే కత్తెర పట్టుకుని కోహ్లీ హెయిర్ స్టైల్ సెట్ చేసింది. ఈ వీడియోను అనుష్క సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోవడంతో పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఇక వీడియో చివర్లో.. హెయిర్ కట్కు ముందు, తర్వాత కోహ్లీ ఎలా ఉన్నాడో తెలిపే ఫొటోలు ఉన్నాయి. అనుష్క చేసిన హెయిర్స్టైల్ చూడ్డానికి బాగుందని అభిమానులు మెచ్చుకుంటున్నారు. అంతకుముందు కోహ్లీ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను 21 రోజుల పాటు ఇళ్ల వద్దనే ఉండాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం, వైద్య సిబ్బంది చెప్పిన విషయాలను కచ్చితంగా పాటించాలని సూచించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos