మహారాష్ట్ర మంత్రి అనిల్ ఇంట్లో ఈడీ సోదాలు

మహారాష్ట్ర మంత్రి అనిల్ ఇంట్లో ఈడీ సోదాలు

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సన్నిహితుడు, రవాణా మంత్రి అనిల్ పరబ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు చేసింది. డపోలీ సిటీలోని ఆయన ఇంటి తోపాటు ముంబై, పుణేలలోని మరికొన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహించింది. డపోలీ సిటీలో భూమిని 2017లో కొన్నపుడు అక్రమాలు జరిగినట్లు ఆరోప ణలు న్నాయి. మరో మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఫిబ్రవరిలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. ఆయనకు దావూద్ ఇబ్రహీం తో సంబంధాలు ఉన్నట్లు ఆరోప ణలు వచ్చాయి. ప్రస్తుతం మాలిక్ జైలులో ఉన్నారు. శివసే, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తమ నేతలపై కేంద్ర దర్యా ప్తు సంస్థలను ప్రయోగిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీపై ఈ కూటమి ఆరోపణలు గుప్పించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos