మొబైల్ విసిరి కొట్టిన బాలయ్య..

  • In Film
  • November 17, 2020
  • 134 Views
మొబైల్ విసిరి కొట్టిన బాలయ్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ కోపం ఉన్న వారిలో బాలయ్యబాబు ఒకరు. ప్లేస్ ఏదైనా, మీడియా ముందు అయినా సరే బాలయ్య బాబు కోపం వస్తే ఉన్నది ఉన్నట్టు రియాక్ట్ అయిపోతారు. అవసరమైతే ఎదుటివారి చెంపకూడా పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది తాజాగా మరోసారి బాలయ్య బాబు కోపంతో సెల్ ఫోన్ విసిరేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.“సేహరి” సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ముందు ఫోన్ రింగ్ అవటంతో.. వెంటనే జోబులో నుంచి తీసిన బాలయ్య బాబు దాన్ని నెంబర్ చూసి స్టేజిపై నుండి పీఏ వద్దకు ఫోన్ విసిరేయటం తో.. స్టేజి మీద సినిమా యూనిట్ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఖచ్చితంగా ఎవరో బాలయ్య బాబు కి కోపం తెప్పించే వ్యక్తి ఫోన్ చేసి ఉంటారని ఈ సన్నివేశాన్ని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా కి వ్యాక్సిన్ రాలేదని రాబోయే రోజుల్లో కూడా రాకపోవచ్చు అని స్పష్టం చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos