కర్ణాటకలో తెలుగు ప్రజల కోసం ఐసొలేషన్ కేంద్రాలు..

కర్ణాటకలో తెలుగు ప్రజల కోసం ఐసొలేషన్ కేంద్రాలు..

కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను స్వస్థలాలకు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని తెలుగు ప్రజలను స్వస్థలాలకు తరలించడానికి పలు చర్యలకు ఉపక్రమించింది.అందులో భాగంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేకంగా ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించుకుంది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో ఆదివారం ఉదయం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం నిర్వహించిన సమావేశం సందర్భంగా ఈ అంశంపై వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.ఇద్దరు ఐఎఎస్ అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు. సతీష్ చంద్ర, పియూష్ కుమార్‌లకు తాత్కాలిక ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పే చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వారు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం, సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వంతో సంప్రదించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ సూచించారు. ఒక్క కర్ణాటక నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చే వలస కార్మికుల కోసం సరిహద్దుల వద్ద తాత్కాలికంగా ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పేలా ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు.సరిహద్దుల వరకు వచ్చి వేచి ఉన్నవారికి అన్ని విధాలుగా సాయం చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించినట్లు పీవీ రమేష్ వెల్లడించారు.అదేవిధంగా కర్ణాటకలోని మంగుళూరు సహా తీర ప్రాంతాల్లో చేపలను వేటాడటానికి కాంట్రాక్టు ప్రాతిపదికన వెళ్లిన తెలుగు ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. నెల్లూరు-676, ప్రకాశం-231, శ్రీకాకుళం-231, విశాఖపట్నం-114, గుంటూరు-18, విజయనగరం-8, తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒకరు ప్రస్తుతం కర్ణాటక సరిహద్దుల్లో చిక్కుకున్నారు. వారిలో 24 మంది ఒడిశాకు చెందిన మత్స్యకారులు కూడా ఉన్నారు. కర్ణాటక, చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని నంగిలి చెక్‌పోస్ట్ వద్ద 1300మంది ప్రస్తుతం సొంత గడ్డపై అడుగు పెట్టడానికి ఎదురు చూస్తున్నారు.ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos