తెలుగు భాషలో ప్రదర్శిస్తున్నారనే అక్కసుతో..

  • In Film
  • October 6, 2019
  • 148 Views
తెలుగు భాషలో ప్రదర్శిస్తున్నారనే అక్కసుతో..

తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం భారీస్థాయిలో విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది.అమెరికా,కెనడా తదితర దేశాల్లో సైరా భారీ వసూళ్లు సాధిస్తోంది.కాగా కెనడాలోని టొరొంటో నగరంలో సైరా చిత్రం ప్రదర్శితమవుతున్న ‘ల్యాండ్‌మార్క్‌ సినిమాస్’లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తి బయటకు తీసి తెరను చించేశాడని సమాచారం. అంతటితో ఆగక థియేటర్లో సైరా చూస్తున్న ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రే చల్లినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం ప్రదర్శన నిలిపివేసిందని కెనడాలోని మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. సినిమా తెలుగు భాషలో ప్రదర్శిస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos