అమెజాన్​కు రూ.202 కోట్ల జరిమానా

అమెజాన్​కు రూ.202 కోట్ల జరిమానా

న్యూ ఢిల్లీ : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థకు గట్టి షాక్ తగి లింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ణయా న్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ వేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఎటీ) సోమవారం కొట్టివేసింది. ఫ్యూచర్ గ్రూపుతో ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. ఒప్పందం విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం సహా ఇతర విషయాలను దాచి పెట్టినందుకు అమెజాన్కు సీసీఐ విధించిన రూ.202 కోట్ల జరిమానా 45 రోజుల లోగా చెల్లించాలని న్యాయమూర్తులు ఎం. వేణుగోపాల్, అశోక్ కుమార్ మిశ్రతో కూడిన ఎన్సీఎల్ఏటీ ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ప్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వ్యాపారాల కొనుగోలుకు రిలయన్స్ 2020 ఆగస్టులో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ కూపన్ సంస్థతో 2019లో తమకు కుదిరిన ఒప్పందం హక్కుల ప్రకారం ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకించింది. ఆ ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిసెంబరు 17న రద్దు చేసింది. తమ అనుమతులు కోరడానికి ముందు అమెజాన్ కొంత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని తెలిపింది. దీంతో సీసీఐ ఆ ఒప్పందాన్ని రద్దు చేసి అమెజాన్ కు రూ.202 కోట్ల విధించింది. మధ్య వర్తిత్వ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్కు ఆదేశాలు జారీ చేయాలని ఫ్యూచర్ గ్రూప్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఫ్యూచర్ గ్రూప్నకు అనుకూలంగా తీర్పు వెలువడింది. జనవరి 5-8 మధ్య జరగాల్సిన మధ్యవర్తిత్వ ప్రక్రియను సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ నిలిపివేసింది. దీన్ని జనవరి 5న అమెజాన్ సుప్రీం కోర్టు లో సవాలు చేసింది. రెండు పక్షాలూ నేషనల్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ వ్యవహారం చెల్లుబాటు కాదంటూ సిసిఐ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని త్వరగా తేల్చాల్సిందిగా ఎన్సీఎల్ఏటీను కోరాలని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్న విలీన ఒప్పందాన్ని రిలయన్స్ రద్దు చేసుకుంది. ఫ్యూచర్ గ్రూప్ రుణదాతలు వ్యతిరేకించటం దీనికి కారణమని రిలయన్స్ పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos