అమలాపాల్ మరీ ఇంత బోల్డా..

  • In Film
  • June 19, 2019
  • 129 Views
అమలాపాల్ మరీ ఇంత బోల్డా..

బోల్డ్‌ కమెంట్స్‌తో,హాట్‌ ఫోటోలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బహుభాష హీరోయిన్‌ అమలాపాల్‌ మరోసారి సంచలనం సృష్టించారు.క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెలుగు,తమిళం భాషల్లో తెరకెక్కిన ఆడై చిత్రం టీజర్‌లో నగ్నంగా కనిపించి అమలాపాల్‌ సంచలనం సృష్టించారు.తెలుగులో ఆమె పేరుతో విడుదల చేసిన టీజర్‌లో నగ్నంగా నటించి అమలాపాల్‌ అటు తమిళం ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారారు.ఇక టీజర్ విషయానికొస్తే.. తన కూతురు కనిపించడం లేదని ఒక తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది.తన కూతురు చివరగా తనతో మాట్లాడినప్పుడు తాగి ఉందని చెప్పడంతో మిస్ అయిన అమ్మాయిని పోలీసులు వెతకడం, చివరగా ఆమె ఓ బిల్డింగ్ లో నగ్నంగా కనిపించడంతో  టీజర్ ని ఎండ్ చేశారు.టీజర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.దర్శకుడు వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె నగ్నత్వంలో నిజాయితీ తన హృదయానికి హత్తుకుందంటూ ట్వీట్ చేశారు.ఈ టీజర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. న్యూడ్ గా నటించిన అమాలపాల్ పై దర్శకనిర్మాతలపై ప్రశంసలు కురిపించాడు. అలాగే అక్కినేని సమంత ఈ టీజర్ పై రెస్పాండ్ అయ్యింది. “ఆడై” టీజర్ ప్రేక్షకులకు అత్యంత ఉత్కంఠ కలింగించేలా, అద్భుతంగా ఉంది, బెస్ట్ విషెస్ టు అమలాపాల్, సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ న్యూడ్ యాక్ట్ కు కొందరు నెగిటివ్ గా స్పందించారు. పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా అన్నట్లు ఆ టీజర్ క్రింద కామెంట్స్ పెట్టారు, సోషల్ మీడియాలో రచ్చ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos