సాయితేజ్‌కు అల్లు అర్జున్ పరామర్శ

  • In Film
  • September 16, 2021
  • 33 Views
సాయితేజ్‌కు అల్లు అర్జున్ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ను అల్లు అర్జున్ నేడు పరామర్శించారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్ సందర్శించారు. తన బంధువైన సాయితేజ్ ను పరామర్శించిన బన్నీ… అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు బన్నీకి తెలిపారు. ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వెల్లడించారు.
మెగా హీరో సాయితేజ్  ఈ నెల 10న హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్పోర్ట్స్ బైకుపై వెళుతున్న సాయితేజ్ రోడ్డుపై ఇసుక ఉండడంతో కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయితేజ్ కాలర్ బోన్ విరగడంతో అపోలో ఆసుపత్రిలో శస్త్ర చకిత్స చేశారు. ప్రస్తుతం సాయితేజ్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos