వయసులో పెద్దదైన హీరోయిన్‌తో అఖిల్ జోడీ?

  • In Film
  • June 20, 2019
  • 95 Views
వయసులో పెద్దదైన హీరోయిన్‌తో అఖిల్ జోడీ?

తెలుగులో హీరోయిన్లకు కొరత ఏర్పడడంతో సీనియర్‌ హీరోలతో పాటు యువ హీరోలు కూడా తమకంటే వయసులో పెద్ద హీరోయిన్లు,చిన్న హీరోయిన్లతో నటించడానికి సిద్ధమవుతున్నారు.సీనియర్‌ హీరోలతో పాటు యువ హీరోలు సైతం గతంలో తమతో నటించిన హీరోయిన్లనే మరోసారి రిపీట్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.యువ హీరో అఖిల్‌ సైతం వయసులో తనకంటే పెద్దదైన పూజా హెగ్డేతో నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.హీరోయిన్ల కొరతతో పాటు పూజాహెగ్డేకు ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా క్రేజ్‌ ఉండడంతో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తే తన సినిమాకు మరింత క్రేజ్‌ వస్తుందనే నమ్మకంతో అఖిల్‌ పూజాతో కలసి నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం.అఖిల్ కంటే మూడేళ్లు పెద్దదైన పూజా స్క్రీన్ పై అఖిల్ కి ఎంతవరకు సెట్టవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos