అజీజ్ ఖురేషీపై దేశ ద్రోహం కేసు

అజీజ్ ఖురేషీపై దేశ ద్రోహం కేసు

లఖ్నవ్: ఉత్తర్ప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై దేశ ద్రోహం కేసు నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భాజపా కార్యకర్త ఆకాశ్ సక్సేనా రామ్పుర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం దీనికి కారణం. ఐపీసీ సెక్షన్ 124ఏ, 153ఏ, 153బీ, 505(1)(బీ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్పుర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్, ఆయన భార్య తంజీమ్ ఫాతిమాను కలిసేందుకు వారి ఇంటికి ఖురేషీ వెళ్లారని తన ఫిర్యాదులో సక్సేనా పేర్కొన్నారు. ఆ సమయంలో యోగి ఆదిత్యానాథ్ సర్కారును ‘రక్తం తాగే పిశాచి ప్రభుత్వం’ అంటూ ఖురేషీ వ్యాఖ్యానించారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించే విధంగా, మత కల్లోలాలను రేకెత్తించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos