ఇండియా ప్రత్యేక విమానాలను అడ్డుకున్న అమెరికా

ఇండియా ప్రత్యేక విమానాలను అడ్డుకున్న అమెరికా

వాషింగ్టన్: అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు నడుపుతున్న ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల్ని అమెరికా అడ్డుకుంటోదని అధికార వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా టికెట్లను సాధారణ పౌరులకూ విక్రయించటం రెండు దేశాల మధ్య ఉన్న పౌర విమానయాన ఒప్పందానికి విఘాతమని అమెరికా రవాణా విభాగం అధికారులు తెలిపారు. దరిమిలా 30 రోజుల పాటు ఆంక్షల్ని విధించింది.అమెరిక వైమానిక సంస్థలు తమ దేశానికి విమానాలు నడప రాదని భారత్ ఆదేశించింది. అమెరికాకు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానాల్లో సాధారణ పౌరులూ, ఫ్రాన్స్ తదితర దేశాలకు ప్రయాణించినందుకు అమెరికా ఆగ్రహించింది. ఎయిర్ ఇండియా విమానాలు భారతీయులను స్వదేశానికి చేర్చే ఉద్దేశంతో కాకుండా, వ్యాపార ధోరణితో ఇండియా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos