అభిజిత్ గంగోపాధ్యాయ్ గాడ్సే వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఫైర్ : మాజీ జ‌డ్జి అభ్య‌ర్ధిత్వం ర‌ద్దుకు డిమాండ్‌

అభిజిత్ గంగోపాధ్యాయ్ గాడ్సే వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఫైర్ : మాజీ జ‌డ్జి అభ్య‌ర్ధిత్వం ర‌ద్దుకు డిమాండ్‌

న్యూఢిల్లీ : గాంధీ, గాడ్సేలను ఉద్దేశించి కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న గంగోపాధ్యాయ్ అభ్యర్ధిత్వాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. గంగోపాధ్యాయ్ ఓ బెంగాలీ వార్తా చానెల్తో మాట్లాడుతూ తాను మహాత్మా గాంధీ, నాథూరాం గాడ్సేల మధ్య ఎవరినీ ఎంచుకోనని, గాడ్సే చర్యల వెనుక హేతుబద్ధతను లోతుగా పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన వ్యక్తిగా తాను కధలోని మరో కోణాన్ని అర్ధం చేసుకు నేందుకు ప్రయత్నించాలని అన్నారు. గాడ్సే రచనలను అధ్యయనం చేసి మహాత్మ గాంధీని చంపేందుకు అతడిని ఏం ప్రేరేపించిందనేది అర్ధం చేసుకోవాలని, అప్పటివరకూ తాను గాంధీ, గాడ్సేల్లో ఎవరి పక్షం వహించనని గంగోపాధ్యాయ్ అన్నట్టు వార్తలు వచ్చాయి. గంగోపా ధ్యాయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని ఆశీస్సులతో కలకత్తా హైకోర్టు జడ్జిగా వైదొలగి బీజేపీ అభ్యర్ధిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి గాంధీ, గాడ్సేల్లో తాను ఎవరిపక్షాన నిలబడనని చెప్పడం దారుణమని అన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు, ఆయన అభ్యర్ధిత్వాన్ని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos