అన్ని సంక్షోభాలకూ మోదీ విధానాలే కారణం

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో మంగళవారం ఇక్కడ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం దేశంలో ప్రతి సంక్షోభానికి మోదీ ప్రభుత్వం చేపట్టే విధానాలే కారణమని ఆరోపించింది. చైనాతో సరిహద్దు వివాదం ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. ‘ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా – భారత్ మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. ప్రతి సంక్షోభానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణం. భారీ ఆర్థిక ఉద్దీపన, పేద ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బులు వెళ్లేలా చర్యలు, ఎమ్ఎస్ఎమ్ఈ లను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ముడి చుమురు ధరలు పడిపోయినా వరుసగా 17 రోజులుగా ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచారు. అధికార యంత్రాంగం చేతుల్లో ఉన్నా కరోనాను కట్టడి చేయడంలో మోదీ విఫలమయ్యార’ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ దుయ్యబట్టారు. సోనియా గాంధీ వ్యాఖ్యలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మద్దతు పలికారు. సరిహద్దు సంక్షోభం ఇలాగే కొనసాగితే దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.గత నెల నుంచి భారత్-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన.. ఈ నెల 15న తీవ్ర రూపం దాల్చింది. గల్వాన్ లోయలో చైనీయులు దుస్సాహసానికి పాల్పడి 20మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos