మార్కెట్లో లభించే ఆధార్ పీవీసీ కాపీలను వినియోగించొద్దు

న్యూ ఢిల్లీ: ఆధార్ పీవీసీ కార్డులను వినియోగించరాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ట్విట్టర్ ద్వారా విన్నవించింది. ‘బహిరంగ మార్కెట్లో లభించే ఆధార్ పీవీసీ కాపీలను వినియోగించడాన్ని ప్రోత్సహించం. ఎందుకంటే వాటిలో భద్రతా ఫీచర్లు ఉండవు. రూ.50 (జీఎస్టీ, స్పీడ్ పోస్ట్ చార్జీలు కలసి) చార్జీ చెల్లించడం ద్వారా ఆధార్ పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందు కోసం https: //myaa dhaar.uidai.gov.in/genricPVC క్లిక్ చేయాల’ని ట్వీట్ చేసింది. యూఐడీఏఐ అధికారికంగా జారీ చేసే ఆధార్ పీవీసీ కార్డు డిజిటల్ సంతకం చేసి, క్యూఆర్ కోడ్ తో, కార్డు దారుడి ఫొటోతో ఉంటుంది. హోలోగ్రామ్, మైక్రో టెక్ట్స్, జారీ చేసిన తేదీ, ప్రింట్ చేసిన తేదీ, ఆధార్ లోగో తదితర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos