నేతలు ఆత్మావలోకనం చేసుకోవాలి

నేతలు ఆత్మావలోకనం చేసుకోవాలి

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు జరగాలని, ప్రక్షాళన జరగాలంటున్న నేతలు అద్దంలో చూసుకుని ఆత్మావలోకనం చేసుకోవాలని లోక్సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవలి బిహార్ శాసన సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించారు. ‘నాయకులు పార్టీపై మాధ్యమాల్లో ఎందుకు బురద జల్లుతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశమయ్యే వరకు ఎందుకు వేచి చూడరు. ఏఐసీసీ సమావేశంలో మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుంది. బిహార్ శాసన సభ ఎన్నికల్లో జరిగిన నష్టం గురించి మాట్లాడాలనుకుంటే, సరైన సమయం వరకు వేచి చూడాలి. ఎన్నికల్లో జరిగిన నష్టంపై పుండు మీద కారం జల్లినట్లు మాట్లాడటం సరి కాదు. కొందరు ఈ పరిస్థితి పట్ల ఆనందంగా ఉన్నారేమో. కాంగ్రెస్ పార్టీకి ఓ సంస్కృతి ఉంది. దాని వల్లే నేతలు నేడు ఈ స్థాయిలో ఉన్నారు. దాని పై వారు దాడి చేయకూడదు. రాహుల్ గాంధీని మాత్రమే నిందించడం వల్ల ఎటువంటి పరిష్కారం ఉండద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos