అబ్బా, కొడుకులు రాష్ట్రాన్ని దోచేశారు :ఆదాల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడైన మంత్రి నారా లోకేష్ ఇద్దరు కలిసి రూ.రెండు నుంచి మూడు లక్షల కోట్ల వరకు దోచే శారని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు ఇందుకూరు పేటలో ఆదివారం సాయంత్రం జజరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని హెచ్చరించారు. సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అధికారంలో ఉంటే నెల్లూరు జిల్లా విధ్వంసమవుతుందని వ్యాఖ్యానించారు. ‘గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పని చేశాను. అందువల్ల ఈ ప్రాంతం నాకు పూర్తిగా తెలుసు. ఇక్కడే చదువు కున్నాన’ని తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు .మైపాడు కోడూరు బీచ్ లను కలిపే రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు అటక ఎక్కించారని ఆవేదన చెందారు. వై.ఎస్.ఆర్. హయాంలో ముత్తుకూరు మండలంలో పరిశ్రమల స్థాపన వల్ల 30 వేలమందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన రుణ మాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని తప్పు బట్టారు.మ గువల కోపాన్ని గమనించి వారి ఉపశమనానికి రూ.పది వేల రూపాయలు సొమ్మును ఇచ్చారని చెప్పారు. మంత్రి నారాయణ మధ్యవర్తిత్వంతో చంద్రబాబు విచ్చల విడిగా దోచుకునిధనపు రాశుల్ని కుప్ప పోసుకున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందనేది బూటకు హామీగా మిగిలిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి చెల్లింపు కూడా పెద్ద నాటకమని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు గత ఐదేళ్ల భృతి బకాయిల్ని ఎవ్వరు చెల్లిస్తారని ప్రశ్నించారు. నాలుగు సార్లు ఓడి పోయిన సోమిరెడ్డికి ఒకటికి నాలుగు పదవులు ఇచ్చి జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు రైతులకు అన్యాయం చేసిన సోమిరెడ్డికి గుణ పాఠం చెప్పే అవకాశం ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉందని గుర్తు చేశారు. నాకు, ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటు వేస్తే ఐదేళ్లపాటు సేవ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గునపాటి సురేష్ రెడ్డి గునపాటి రమేష్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి ఝాన్సీ నరేంద్ర రెడ్డి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
కోవుర్లో మూతబడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు తాను, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రయత్నిస్తామని ఆదాల ప్రభాకర్రెడ్డి భరోసా ఇచ్చారు. బుచ్చిరెడ్డి పాలెం లో ఆది వారం జరిగిన ఆత్మీయసభలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తో కలిసి ప్రసంగించారు. దాదాపు 200 మంది ఈ సందర్భంగా పార్టీలో చేరారు. చంద్రబాబు రుణమాఫీ సక్రమంగా చేయనందున రైతులు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు . ‘గతంలో నేను ఎన్నో శ్రమల కోర్చి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చవి చూస్తే ఎలాంటి పదవి ఇవ్వలేదు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి ప్రయత్నిస్తే నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయమంటూ సోమిరెడ్డి అనుచరులు వెన్నుపోటు పథకాన్ని రచించారు. దాన్ని గ్రహించి రని బయటకు రావాల్సి వచ్చింది. నాకు గత అయిదేళ్లలో ఎన్నో అవమానాలు జరిగాయి. పళ్ల బిగువున భరించారు. ఇక వాటిని భరించ లేక బయటికి వచ్చాం. జగన్ నాకు ఫోన్ చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానించార’ విపులీకరించారు. ‘పనబాక లక్ష్మి, విష్ణువర్ధన రెడ్డిని పార్టీలో చేర్చుకున్నచంద్రబాబు నేను పార్టీ మారడం మాత్రం మోసం అని చెప్పడం హాస్యాస్పదం’ అని విమర్శించారు.‘ నేను పార్టీ మారేటప్పుడు ఏమీ తీసుకు రాలేద’ని స్ప ష్టీకరించారు. వైయస్ హయాంలో ఉచిత కరెంటు ఫీజు రియంబర్స్మెంట్ తదితర పథకాలను అమలుచేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. ప్ర పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్న జగన్ను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పుట్ట ధనలక్ష్మి వేటూరి శివరామకృష్ణాడ్డి మేనకూరు సీతారాం రెడ్డి స్వర్ణ వెంకయ్య కోటేశ్వర్ రెడ్డి ఝాన్సి నరసింహారావు శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇందుకూరుపేట మండలం నుంచి దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు వైకాపాలో చేరారు. మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు .వైకాపా పాటల సిడిని ఆవిష్కరించారు . జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆదాల అభిప్రాయపడ్డారు. దాదాపు వెయ్యి మంది టిడిపి కార్యకర్తలు పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ స్పందన ఇలాగే కొనసాగుతుందని వైసిపికి విజయం తథ్యం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి కోటేశ్వర్ రెడ్డి పాముల హరి ఝాన్సీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos