హీరో సచిన్ జోషి అరెస్ట్..

హీరో సచిన్ జోషి అరెస్ట్..

తెలుగు,హిందీ చిత్ర పరిశ్రమల్లో పలు చిత్రాల్లో హీరోగా నటించిన సచిన్ జోషిని పోలీసులు అరెస్ట్ చేయడం చిత్ర వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.గుట్కా అక్రమ రవాణా చేస్తున్న నేపంతో ముంబయిలో హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా, పలు సంచలన విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తుంది.అందులో భాగంగానే సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారట. అయితే గత కొన్ని రోజులుగా ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు జరుపగా ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్టు తెలుస్తుంది.సచిన్‌పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలుపై కేసు నమోదు చేశారు.భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారని, ముందస్తు సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు గుట్కా బాక్సులు స్వాధీనం చేసుకొన్నారు. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందట. అయితే అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ని బెయిల్‌పై విడుదల చేశారని సమాచారం.హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్‌ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు.ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నారట. దీంతో అక్రమంగా భారీగా సంపాదించి ఎంజాయ్‌ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంటుంది.సచిన్‌ జోషి `మౌనమేలనోయి`, `నిను చూడక నేనుండలేను`, `ఒరేయ్‌ పండు`, `ఆజాన్‌`, `జాక్‌పాట్‌`, `వీరప్పన్‌`, `వీడెవడు`, `నెక్ట్స్ ఏంటీ`, `అమావాస్‌` చిత్రాల్లో నటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos