మూక దాడుల్ని ఆక్షేపించిన వారు దేశద్రోహలు

మూక దాడుల్ని ఆక్షేపించిన వారు దేశద్రోహలు

ముజఫర్ పూర్ : మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేసి ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన యాభై మంది మంది సాహితీ వేత్తలు, కళాకారులకు వ్యతిరేకంగా ఇక్కడి పోలీసులు  దేశ ద్రోహ ఆరోపణ కేసు నమోదు చేశారు. నిందితుల్లో  సినీ దర్శకుడు మణిరత్నం, రామచంద్ర గుహ, అపర్ణా సేన్, శ్యామ్ బెనగళ్, అనురాగ్ కశ్యప్, సౌమిత్ర ఛటర్జీ తదితరులకు వ్యతిరకంగా ఇక్కడి పోలీసులు దేశద్రోహనేరారోపణ కింద ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసారు. ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై మూక హత్యలను వెంటనే ఆపాలని వారు ప్రధానికి రాసిన లేఖలో కోరారు. పేర్కొన్నారు. అసమ్మతి లేకుండా ప్రజాస్వామ్యం ఉండదని అప్రమత్తం చేసారు. జై శ్రీరాం నినాదాన్ని రెచ్చగొట్టేందుకు ఉపయోగించే స్థాయికి దిగ జార్చారని మండి పడ్డారు.దీన్ని ఆక్షేపించిన స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. దీన్ని విచారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ లేఖ రాసిన వారిపై కేసు దాఖలు చేయాలని రెండు నెలల కిందట ఆదేశాలు జారీ చేసారు. దరిమిలా ప్రాథమిక సమాచార నివేదిక నమోదు చేశామని పోలీసులు తెలిపారు. లేఖపై సంతకాలు చేసిన 50 మందినీ నిందితులుగా పేర్కొని పిటిషన్ వేశానని సుధీర్ కుమార్ తెలిపారు. వారు దేశ ప్రతిష్టను దెబ్బతీసి, ప్రధాని కార్యదక్షతను కించ పరిచారని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిపై దేశద్రోహం, పబ్లిక్ న్యూసెన్స్, మత విశ్వాసాలకు విఘాతం కలిగించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos