ముళ్ల పొదల్లో పసికందు

ముళ్ల పొదల్లో పసికందు

హోసూరు : ఇక్కడి సిప్‌కాట్ ప్రాంతంలోని ముళ్ళ పొదల్లో అప్పుడే పుట్టిన పసికందును వదలివెళ్లారు. హోసూరు పారిశ్రామికవాడ రాజేశ్వరి లేఔట్ ప్రాంతంలోని ముళ్ల పొదల్లో సోమవారం ఉదయం ఓ పసికందు అరుపులు వినిపించాయి. స్థానికులు ముళ్ల పొదల్లోకి వెళ్ళి చూడగా గంటల ముందు పుట్టిన పసికందు కనిపించింది. కన్న తల్లి పసికందును పొదల్లో పెట్టి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై హోసూరు సిప్‌కాట్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముళ్ళ పొదల్లో దొరికిన మగ శిశువును హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos