ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం..ఇదే వారి ఫార్ములా

ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం..ఇదే వారి ఫార్ములా

న్యూ ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఢిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదన్న లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆతిశీ ఈ మేరకు స్పందించారు. ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా ఆయన (లెఫ్టినెంట్ గవర్నర్) మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని గుర్తు చేశారు. ఏ ఇతర అవకాశం లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసిందన్నారు. ‘ఈడీ మీ చేతిలో ఉంది. వారికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు అయ్యే నేతలు బెయిల్ పొందలేరు. దీనికింద అందరు విపక్ష సీఎంలు అరెస్టవుతారు. అప్పుడు వారు రాజీనామా చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం.. ఇదే వారి ఫార్ములా’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ఆప్నకు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని ఆతిశీ అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం అవుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆప్ నేత దీపక్ సింగ్లా ఇంట్లో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos