ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించే ప్రయత్నాలు

ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించే ప్రయత్నాలు

న్యూఢిల్లీ: సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా ఆప్ శ్రేణులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి యత్నించిన ఆప్ నేతలు బుధవారంఢిల్లీ అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టారు.ఢిల్లీ మంత్రులు అతిశీ , సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం ఢిల్లీ అసెంబ్లీ వద్ద నిరసన తెలిపారు. పసుపు రంగు టీషర్ట్లు ధరించిన నేతలు.. ఈడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం అరెస్ట్ అక్రమమంటూ నినదించారు. అసెంబ్లీ ముందు బైఠాయించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అతిశీ మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్ట్కు వ్యతిరేకంగా తమ ఎమ్మెల్యేలంతా నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు.
కేజ్రీ సవాల్ పిటిషన్పై నేడు విచారణ
మరోవైపు మద్యం పాలసీ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేయనున్నది. తన అరెస్టు, ఈడీ రిమాండ్ అక్రమమని, తనను వెంటనే విడుదల చేయాలని కేజ్రీవాల్ న్యాయస్థానానికి విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos