11, 12 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

11, 12 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు అల్పపీడనం కదలనుంది. ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos