లఖింపూర్ బాధితులకు న్యాయం చేయాలి

లఖింపూర్  బాధితులకు న్యాయం చేయాలి

న్యూఢిల్లీ: లఖింపూర్ హింసాత్మక ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అందించినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. రాష్ట్రపతికి బుధవారం ఇక్కడ వినతి పత్రాన్ని అందించిన తర్వాత రాహుల్ విలేఖరులతో మాట్లాడారు. ‘ఈ ఘటనలో నిందితుడి తండ్రి హోం శాఖ సహాయ మంత్రి అయి నందున ఆయన పదవిలో ఉండే నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదు. ఆ దృష్ట్యా ఆయనను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి చెప్పాం. సుప్రీం కోర్టుకు చెందిన ఇద్దరు ప్రస్తుత న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి’అని కోరినట్లు వివరించారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయడం లేదా పదవి నుంచి తప్పించి నప్పుడు మాత్రమే లఖింపూర్ హింసాత్మక ఘటనలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. లఖింపూర్ ఘటనపై బుధవారమే తాను ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్ర పతి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులూ వారి వెంట ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos