రాజస్థాన్​ లో బాల్య వివాహాలు చట్ట బద్ధం

రాజస్థాన్​ లో బాల్య వివాహాలు చట్ట బద్ధం

జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వం బాల్య వివాహాలకు చట్టబద్ధత కల్పించింది. పిల్లలకు చేసే పెళ్లిళ్లను నమోదు చేసేలా రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ (సవరణ) ముసాయిదా విధాన సభ ఆమోదాన్నిపొందింది. దాని ప్రకారం మైనర్లకు పెళ్లి చేస్తే.. నెలలోపు ఆ వివరాలను అధికారులకు వారి తల్లిదండ్రులు తెలిపి పెళ్లిని నమోదు చేయాలి. దీనిపై బీజేపీ సహా విపక్షాలు మండి పడ్డాయి. బాల్యవివాహాలకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. చట్ట సవరణ ద్వారా బాల్య వివాహాలను అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్ దీనికి భిన్నమైన వాదన వినిపించారు. బాల్య వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నట్టు సవరణలో ఎక్కడా చెప్పలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ సవరణ చేశామన్నారు. భర్త చనిపోయిన మహిళలకు ప్రభుత్వ ఫలాలు అందాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరని, అందుకే పెళ్లి నమోదను తప్పనిసరి చేశామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos