కరోనా పుట్టుకపై అమెరికాలోనూ దర్యాప్తు జరపాలి

కరోనా పుట్టుకపై అమెరికాలోనూ దర్యాప్తు జరపాలి

బీజింగ్ : కరోనా వైరస్ పుట్టుకపై అమెరికాలోనూ దర్యాప్తు జరపాలని చైనా సాంక్రమికవ్యాధులు నిరోధక ఉన్నతాధికారి జెన్ గువాంగ్ జా డిమాండ్ చేసారు. ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. 2019 డిసెంబరు ప్రారంభంలోనే అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో ఏడుగురికి సార్స్-కోవ్-2 సోకినట్లు అక్కడి ఒక అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభంలో అమెరికాలో ఎందుకు తక్కువ పరీక్షలు చేసారని జెన్ గువాంగ్ ప్రశ్నించారు. అమెరికాలోనే అధిక సంఖ్యలో బయోలాజికల్ ప్రయోగ శాలలున్నాయని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్కు సంబంధించిన మూలాలను అన్ని దేశాల్లో పరిశోధించాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్ కోరారు. కరోనా వైరస్ మూలాల గురించి చైనా, అమెరికాకు మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. కరోనా మొదటికేసు నమోదైన వుహాన్లో ఉన్న వైరాలజీ ఇన్స్టిట్యూట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఇప్పటికే అనేక సార్లు పరిశీలించారు. కరోనా పుట్టుకపై ఇప్పటికే అనేక వదంతులు వచ్చాయి. గత సెప్టెంబరులోనే యూరోప్లో కరోనా కేసులు వచ్చాయని ఒక పరిశోధనలో తేలింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos