ఓటర్లకు చీరలు, డబ్బులు పంచుతున్న బీజేపీ

ఓటర్లకు చీరలు, డబ్బులు పంచుతున్న బీజేపీ

పట్నా: ప్లురల్స్ పార్టీ నేత, బంకీపూర్ శాసన సభ అభ్యర్థి పుష్ఫం ప్రియా చౌదరి సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించిన వీడియో సంచలనమైంది. ఒక భాజపా నేత ఓటర్లను ప్రలోభపెపట్టి డబ్బులు పంచుతున్నదృశ్యం అందులో ఉండటం ఇందుకు కారణం. ఒక వాహనానికి కట్టిన బ్యానర్ పై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్ పేరు రాసి వుంది. ఆ వాహనంలో ఎన్నో చీరలున్నాయి. ఆ వాహనం దగ్గరున్న కొందరు అశోక్ కుమార్ సింగ్ కు జయకారాలు చేస్తున్నారు. అక్కడున్న జనం డబ్బులు పంచుతున్నారని చెప్పుకుంటున్నారు.దీనిపై విలేఖరులు అశోక్ కుమార్ సింగ్ కోసం ఫోను చేయగా, దానిని రిసీవ్ చేసుకోలేదు. . తాము ఓటర్లకు చీరలు, డబ్బులు పంచలేమని, అయితేఅధికారంలోకి వస్తే యువత గౌరవప్రదంగా జీవించేందుకు ఉద్యోగాలు కల్పిస్తామని పుష్ఫం ప్రియా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos